: లోకేష్ కోసం మేము రాజీనామా చేస్తామంటే, మేము చేస్తామంటూ పోటీ పడుతున్న టీడీపీ నేతలు!
టీడీపీ యువరాజు నారా లోకేష్ ను కేబినెట్ లో తీసుకునేందుకు వీలుగా ఆయన కోసం విజయవాడ టీడీపీ నేతలు త్యాగాలకు సిద్ధపడుతున్నారు. మేము రాజీనామా చేస్తామంటే, మేము రాజీనామా చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. లోకేష్ కోసం రాజీనామాకు సిద్ధమని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. లోకేష్ పెనమలూరు నుంచి పోటీ చేయాలని ఆయన ఆకాంక్షించారు. లోకేష్ లాంటి యువనాయకుల అవసరం పార్టీకి ఉందని ఆయన పేర్కొన్నారు. లోకేష్ కోసం తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి దీనిపై మాట్లాడుతానని ఆయన అన్నారు. లోకేష్ ను ఎమ్మెల్సీగా పెద్దల సభకు పంపి కేబినెట్ లోకి తీసుకోవాలని కోరతానని ఆయన చెప్పారు.