: నా వయసు 64 ఏళ్లు... ఇక పార్టీలు మారి ఏం సాధిస్తాను?: జ్యోతుల నెహ్రూ


పార్టీలు మారే విషయంలో తన విశ్వసనీయతను ప్రశ్నించవద్దని టీడీపీలో చేరబోతున్న జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తన వయసు 64 ఏళ్లని, ఇంకా రాజకీయాల్లో సాధించాల్సిన లక్ష్యాలు ఏమీ లేవని అన్నారు. ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. నాయకుల్ని తయారు చేశానని చెప్పిన ఆయన, తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడో, రాడో చెప్పలేనని ఆయన అన్నారు. భవిష్యత్ గురించి ప్రస్తుతానికి ఏమీ నిర్ణయించుకోలేదని ఆయన అన్నారు. భవిష్యత్ ను దేవుడే నిర్ణయిస్తాడని ఆయన చెప్పారు. తనకు పదవీ వ్యామోహం లేదని ఆయన చెప్పారు. ముక్కుసూటిగా ఉండే తత్వమే తనకు బలం, బలహీనత అని ఆయన చెప్పారు. జగన్ అయినా, చంద్రబాబు అయినా తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెబుతానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News