: హేమమాలిని ఇంత కఠినాత్మురాలా? నెటిజన్ల విమర్శలు
బుల్లితెర హీరోయిన్ ప్రత్యూష ఆత్మహత్య తరువాత, డ్రీమ్ గర్ల్ హేమమాలిని చేసిన ట్వీట్ ఆమెకు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. గత రాత్రి ఆమె తన ట్విట్టర్ వేదికగా ట్వీట్లు పెడుతూ "మూర్ఖంగా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఏమీ సాధించలేరు. జీవితం దేవుడిచ్చిన వరం. ప్రాణాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు" అని వ్యాఖ్యానించగా, ఈ ట్వీట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిసార్లు జీవించడం కూడా అత్యంత క్లిష్టతరమవుతుందని, ఇలా మరణించిన వారిపట్ల హేమమాలిని కఠినంగా వ్యాఖ్యానించడం ఆమె స్థాయికి తగదని రీ ట్వీట్లు వస్తున్నాయి. ఇవి కాఠిన్యంతో కూడిన వ్యాఖ్యలని, హేమమాలిని మనసు సున్నితంగా లేదని నెటిజన్లు అంటున్నారు. ఆత్మహత్య చేసుకోవడంతో సమస్యలకు పరిష్కారం దొరకదన్నది నిజమే అయినా, సమాజంలో మంచి గుర్తింపున్న వారు ఇలాంటి మాటలను చెప్పడం గొప్పనిపించుకోదని మరికొందరు హితవు పలికారు.