: తన చుట్టూ వున్న వారిని జగన్ నమ్మడు!: జ్యోతుల నెహ్రూ
వైఎస్సార్సీపీలో నాయకత్వలోపం ఉందని ఆ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీలో రాజకీయ పరిపక్వత లేదని అన్నారు. జగన్ తన చుట్టూ ఉన్నవారిని నమ్మడని ఆయన చెప్పారు. తాను సరైన దారిలోనే వెళ్తున్నాను కదా...తనను ప్రజలు ఎందుకు నమ్మట్లేదు? అని జగన్ ఆలోచిస్తే...ఎన్ని కష్టనష్టాలు ఎదురవుతున్నా తాము జగన్ తోనే కలిసి నడుస్తున్నాము కదా, తమను జగన్ ఎందుకు నమ్మట్లేదని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారని జ్యోతుల చెప్పారు. ప్రత్యర్థి ఎన్ని విమర్శలు చేసినా జగన్ నవ్వుతూ వాటిని తేలిగ్గా తీసుకుంటారని ఆయన తెలిపారు. కానీ సొంత నేతలు ఏదన్నా అంటే ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేరని ఆయన చెప్పారు.