: అమెరికా మరోసారి భారత్ వ్యతిరేక నిర్ణయం తీసుకుంది...పాక్ కు వార్ హెలికాప్టర్లను విక్రయిస్తోంది!
తనను తాను సమర్థించుకోవడంలో అమెరికాను మించిన వారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. గతంలో పాకిస్థాన్ కు అమెరికా తన ఫైటర్ జెట్ ఎఫ్-16 విమానాలు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్ నేరుగా అమెరికాకు అభ్యంతరం తెలిపింది. అదే సమయంలో ఆ దేశ మాజీ సైనికాధికారులు కూడా పాకిస్థాన్ ఈ ఫైటర్ జెట్ లను భారత్ పై యుద్ధానికి వినియోగిస్తుందని పేర్కొనడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ పాక్ కు యుద్ధ హెలికాప్టర్లను విక్రయించేందుకు సిద్ధమైంది. ఏహెచ్-1జెడ్ వైపర్ హెలికాప్టర్లను పాక్ కు విక్రయించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు పెంటగాన్ అధికారులు తెలిపారు. ఈ హెలికాప్టర్లను సైనిక దాడులకు ఉపయోగిస్తారు. కాగా, ఈ డీల్ ధర 170 మిలియన్లు ఉండనున్నట్టు తెలుస్తోంది.