: కిడ్నాప్ నుంచి తప్పించుకునేందుకు కార్లోంచి దూకేసిన మోడల్!


మాజీ బాయ్ ఫ్రెండ్ కిడ్నాప్ బారినుంచి తప్పించుకునేందుకు ఓ మోడల్ కార్లోంచి దూకిన ఘటన భోపాల్ లో చోటుచేసుకుంది. మోడలింగ్ లో రాణిస్తున్న యువతి ఉదయం 9 గంటల సమయంలో స్నేహితులతో కలిసి వెళ్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి కారులో అపహరించారు. ఆమెపై దాడి చేస్తూ, ముఖం మీద యాసిడ్ పోస్తామని బెదిరించారు. దీంతో బెంబేలెత్తిన ఆమె కదులుతున్న కారులోంచి దూకేసింది. ఆమె స్నేహితులు ఆమె కారును వెంబడించడంతో ఆమెను వారు రక్షించగలిగారు. దీంతో ఆమె భోపాల్ పోలీస్ స్టేషన్ లో మాజీ ప్రియుడు అమీర్ పై ఫిర్యాదు చేసింది. బ్రేకప్ కావడంతో తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని, ఇందులో అతని స్నేహితుడు తయ్యబ్ హస్తం కూడా వుందని అని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News