: ‘స్టాండప్ ఇండియా’ ఉత్తరప్రదేశ్ కోసమేనా?
ఉత్తరప్రదేశ్ లో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80 పార్లమెంట్ స్థానాల్లో 71 స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే మాదిరి ఫలితాలను ఈసారి జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సాధించేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా యూపీ జనాభాలో 20 శాతం ఉన్న దళితుల ఓట్లపైనే అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ‘స్టాండప్ ఇండియా స్కీమ్’కు మోదీ శ్రీకారం చుట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, దళిత మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ పథకం ఉద్దేశం! కాగా, ఈ పథకంలో భాగంగా వ్యవసాయేతర రంగాలకు రూ.10 లక్షల వరకు రుణంగా అందించనున్నారు. పెట్టుబడిదారులకు రూపీ డెబిట్ కార్డులను ఇవ్వనున్నారు. ఇందుకోసం 'సీఐడీబీఐ'కు రూ.10 వేల కోట్లను కేటాయించారు. అదేవిధంగా ఈ-రిక్షాలు అందించడానికి రిజిస్ట్రేషన్ కోసం ‘ప్రధానమంత్రి ముద్రా యోజనా స్కీమ్’ వెబ్ సైట్ ను కూడా ఈరోజు మోదీ ప్రారంభించనున్నారు.