: విడాకులు తీసుకున్నా మాజీ భర్తకు వండిపెట్టడమంటే ఇష్టం: హాలీవుడ్ నటి


సాధారణంగా విడాకులు తీసుకుంటే వారి మొఖం చూసేందుకు కూడా ఇష్టపడరు...అలాంటిది విడాకులు తీసుకుని రెండేళ్లయినప్పటికీ తన మాజీ భర్త కోసం వంట చేస్తానని ప్రముఖ హాలీవుడ్ నటి గ్వెనెత్ పాల్ట్రో తెలిపింది. ఆమె తాజాగా రాసిన 'ఇట్స్ ఆల్ ఈజీ: డెలిషియస్ వీకెండ్ రెసిపీ' పుస్తకం ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, మాజీ భర్త క్రిస్ మార్టిన్ కోసం వంట చేసి తన చేతులతో వడ్డించడమంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇప్పటికీ తన మాజీ భర్తతో కలిసి వెకేషన్ కు వెళ్తానని గ్వెనెత్ పేర్కొంది. భోజన ప్రియురాలైన తాను కుటుంబం, స్నేహితుల కోసం వంట చేస్తానని వెల్లడించింది. హెల్తీ డైట్ కు ప్రాధ్యాన్యమిచ్చే తాను, తన పిల్లలు యాపిల్, మోజెస్ విషయంలో అంత కఠినంగా ఉండనని చెప్పింది. కాగా, ఆస్కార్ విజేతగా హాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న గ్వెనెత్ 'ఐరన్ మ్యాన్', 'ఐరన్ మ్యాన్ 3', 'ఎమ్మా', 'షేక్ స్పియర్ ఇన్ లవ్' వంటి సినిమాల్లో నటించింది.

  • Loading...

More Telugu News