: తెలుగులో వచ్చే డబ్బింగ్ సినిమాలను ఎందుకు బ్యాన్ చేయాలి?: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
తెలుగులో వచ్చే డబ్బింగ్ సినిమాలను ఎందుకు బ్యాన్ చేయాలి? బాగున్న సినిమాలను చూడొద్దని అనే హక్కు, అధికారం ఎవరికీ లేవు. మనకు చేతనైతే వాటి కన్నా మంచి సినిమాలను తీయాలి' అంటూ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ పైడిపాల రచించిన ‘తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు పరిశోధనా గ్రంథం’ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలోని అన్ని విభాగాల్లోనూ డబ్బింగ్ ప్రక్రియ చాలా క్లిష్టమైందని, డబ్బింగ్ సినిమాలకు సంబంధించిన క్రెడిట్ అంతా రచయితలకే దక్కుతుందని అన్నారు. అనంతరం, గ్రంథ రచయిత పైడిపాల మాట్లాడుతూ, డబ్బింగ్ రంగం అంటే చిన్న చూపు ఉందని, నిర్లక్ష్యానికి గురైన ఈ రంగం కష్టనష్టాలను ప్రపంచానికి తెలియజేయడానికే దీనిని రచించానని, తన బాధ్యతగా ఈ పరిశోధన చేశానని ఆయన చెప్పారు.