: బీహార్ లో మద్యం అమ్మకాలపై నిషేధం అమలు


మద్యంపై నిసేధం విధించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా బీహార్ చేరింది. బీహార్ లో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. బార్లు, హోటళ్లలో ఇకపై మద్యం సరఫరా చేయరని, మద్యం అమ్మకాలకు లైసెన్స్ లు ఇవ్వరని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఆర్మీ క్యాంటీన్లలో మాత్రం మద్యం అమ్మకాలు యథావిధిగా కొనసాగుతాయి. మద్యం అమ్మకాలపై నిషేధంతో రూ.25 వేల కోట్ల రాబడిని ప్రభుత్వం కోల్పోవలసి వస్తుందని సమాచారం. కాగా, గుజరాత్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో మద్యనిషేధం అమలులో ఉన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News