: అక్షర హాసన్ తో డేటింగే చేయలేదు: తనుజ్


కమల్ హాసన్ రెండో కుమార్తె, శ్రుతిహాసన్ చెల్లెలు అక్షర హాసన్.. సీనియర్ నటి అయిన రతి అగ్నిహోత్రి కొడుకు తనుజ్ విర్వానితో డేటింగ్ చేస్తోందంటూ గత కొంత కాలంగా వార్తలు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే, ఇకపై స్నేహితులుగా ఉండాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నట్టు టాక్‌. తాజాగా దీనిపై తనుజ్ స్పందించాడు. అక్ష‌ర‌తో తాను డేటింగే చేయలేదని అన్నాడు. అస‌లు 'మేమిద్ద‌రం డేటింగ్ చేస్తున్నట్టు ఎప్పుడూ చెప్పలేదు' అని తెలిపాడు. ఇక త‌మ కుటుంబ సభ్యులు అక్ష‌ర‌తో సంబంధం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు వ‌చ్చిన కామెంట్ల‌పై స్పందిస్తూ.. 'మేము ఎటువంటి వారిమో మా పేరెంట్స్‌కి తెలుసం'టూ స‌మాధానం ఇచ్చాడు. గ‌తంలో అక్షర హాసన్.. తనుజ్ ఏర్పాటు చేసిన ఓ పార్టీలో పాల్గొంది. ఆ సమయంలో తీసిన కొన్ని ఫోటోలను తనుజ్ సోష‌ల్‌మీడియా ద్వారా పంచుకున్నాడు. దీంతో తనుజ్ తో అక్షర హసన్ డేటింగ్ చేస్తోందని అభిమానులు బ‌లంగా న‌మ్మేశారు.

  • Loading...

More Telugu News