: రాహుల్ రాజ్‌సింగ్ కు వేరొక యువతితో నిశ్చితార్థం జరగడమే ప్రత్యూషను డిప్రెషన్‌లోకి నెట్టిందా..?
'బాలికా వధు' (తెలుగులో ప్రసారమవుతున్న చిన్నారి పెళ్లికూతురు) హిందీ సీరియల్‌లో ఆనందిగా నటించిన ప్రత్యూష బెనర్జీ(24) ముంబయిలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై పలు వాదనలు వినిపిస్తున్నాయి.ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్‌సింగ్ వల్ల ఆమె సమస్యలు ఎదుర్కొందని తెలుస్తోంది. రాహుల్‌కు ఈ మధ్యే వేరొక యువతితో నిశ్చితార్థం జరగడం ప్రత్యూషను డిప్రెషన్‌లోకి నెట్టిందని అనుకుంటున్నారు. ముక్కు, కంటి వద్ద గాయం ఉండడంతో ఇది ఒక పథకం ప్రకారం చేసిన హత్య అని బంధువర్గం అనుమానిస్తోంది. అయితే ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి, రాహుల్‌కి ఎలాంటి సంబంధం లేదని, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నందు వల్లే ఆమె సూసైడ్ చేసుకుందనే మరో వాదన కూడా వినిపించింది. కాగా, ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలను తెలిపే ‘సూసైడ్ నోట్’ పోలీసులకు ఎక్కడా కనిపించలేదు. దర్యాప్తు పూర్తయితేగాని ఆమె మరణానికి దారితీసిన కారణాలు తెలియవు. దేశ వ్యాప్తంగా ఎంతో పాప్యులారిటీ సంపాదించిన నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కలిచివేస్తోంది.