: పెరిగిన ధరల తరువాత, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవి!


అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరిగాయని చెబుతూ, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రో ఉత్పత్తుల ధరలను సవరించిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 65.90, డీజిల్ ధర రూ. 53.19కి చేరుకున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 67.15కు, డీజిల్ ధర రూ. 53.91కి, విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 67.18, డీజిల్ రూ. 54.39కి పెరిగాయి. గతంలో ధరలను తగ్గించినప్పుడు, సుంకాలను పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు మాత్రం సుంకాలను తగ్గించే ఊసే ఎత్తకపోవడం గమనార్హం. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది.

  • Loading...

More Telugu News