: గతిమాన్ పట్టాలెక్కేసింది!... సూపర్ ఫాస్ట్ రైలును ప్రారంభించిన సురేశ్ ప్రభు


దేశంలోనే సూపర్ ఫాస్ట్ రైలుగా ప్రసిద్ధికెక్కిన గతిమాన్ ఎక్స్ ప్రెస్ కొద్దిసేపటి క్రితం పట్టాలెక్కేసింది. దేశ రాజధాని నుంచి ఆగ్రా వరకు పరుగులు పెట్టనున్న ఈ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించారు. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లనున్న గతిమాన్ ఎక్స్ ప్రెస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించే అవకాశాలున్నాయని ఈ సందర్భంగా ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను పరిశీలించి మరిన్ని మార్గాల్లో ఈ తరహా రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News