: శిల్పా మోహన్ రెడ్డి తీరు బాగాలేదు: చంద్రబాబుకు భూమా ఫిర్యాదు


కర్నూలు జిల్లాలో శిల్పా మోహన్ రెడ్డి వైఖరి తమకు ఇబ్బందికరంగా మారిందని, ఇటీవల వైకాపా నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు బొండా ఉమాతో కలసి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల జిల్లాలో జరిగిన హత్యాయత్నాలకు, తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, భూమా కుటుంబం టీడీపీలో చేరిన తరువాత, జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు మరోమారు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇటీవల శిల్పా అనుచరుడిపై దాడి కూడా జరిగింది. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి సైతం ఇప్పటికే భూమాపై చంద్రబాబు వద్ద ఫిర్యాదు చేశారు. తమను టీడీపీ నుంచి వెళ్లగొట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News