: రెచ్చిపోయిన దొంగలు... ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో స్వైరవిహారం
దొంగలు మరోమారు రెచ్చిపోయారు. పట్టాలపై కదులుతున్న రైలులో దోపిడీకి పాల్పడ్డ దొంగలు ఆ తర్వాత చైన్ లాగి రైలును ఆపేసి దర్జాగా దిగిపోయారు. భువనేశ్వర్-బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిధిలోని కృష్ణంశెట్టిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి రైలు రాగానే అప్పటికే అందులోకి చొరబడ్డ దొంగలు నానా బీభత్సం సృష్టించారు. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన దొంగలు ఓ మహిళ మెడలోని చైన్ ను లాగేసుకున్నారు. ఆ తర్వాత చైన్ లాగి రైలును ఆపేసి దర్జాగా దిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోగానే దొంగలు పరారయ్యారు.