: ఆరోపణలు నిరూపించకపోతే... ‘సాక్షి’పై క్రిమినల్ కేసు వేస్తానంటున్న ఏపీ పౌర సరఫరాల సంస్థ చైర్మన్


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ దినపత్రికపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లెల లింగారెడ్డి నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (డీఎస్ఓ)ని లింగారెడ్డి బెదిరించినట్లు ‘సాక్షి’ పత్రికలో ఓ వార్త ప్రచురితమైంది. దీనిపై నిన్న హైదరాబాదులోని సచివాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన లింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల రవి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న వ్యక్తి రేషన్ షాపును నిర్వహిస్తుండటమే కాక అక్రమాలకు పాల్పడుతున్న విషయంపై డీఎస్ఓను వివరణ అడిగానని లింగారెడ్డి తెలిపారు. అయితే డీఎస్ఓను తాను దూషించలేదని లింగారెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ‘సాక్షి’ దినపత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని ఆయన మండిపడ్డారు. డీఎస్ఓను తాను దూషించినట్లు నిరూపించలేకపోతే ‘సాక్షి’ పత్రికపై క్రిమినల్ కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News