: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన


హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బెంగళూరు వెళ్లాల్సిన వంద మంది ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. నేటి సాయంత్రం 4 గంటలకు హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానానికి వీరంతా బెంగళూరు వెళ్లాల్సి ఉంది. అయితే నాలుగు దాటిన తరువాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, మరో విమానం ఏర్పాటు చేస్తున్నామని ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ చెప్పింది. అయితే, నాలుగు గంటలకు పైగా ఎదురు చూపులు చూసిన తరువాత మరో విమానం వచ్చింది. ఇక ప్రయాణికులు అందులోకి ఎక్కే సమయంలో... అందులో కూడా సాంకేతిక లోపం ఏర్పడిందని, కాసేపట్లో నిర్ణయం చెబుతామని ప్రకటించారు. అనంతరం కాసేపటికి బెంగళూరు వెళ్లాల్సిన విమానం రద్దు చేస్తున్నామని, ప్రయాణికుల డబ్బులు వెనక్కి ఇస్తామని చెప్పింది. దీంతో సుమారు 100 మంది ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News