: నిన్న కెప్టెన్...నేడు కోచ్ రాజీనామా... పాక్ క్రికెట్ లో కుదుపు!


పాకిస్థాన్ క్రికెట్ లో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై ఓటమితో పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో ఆ జట్టుపై స్వదేశంలో తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కొంత మంది ఆటగాళ్లు నేరుగా స్వదేశం వెళ్లగా, మిగిలిన వారు షార్జా వెళ్లారు. పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ నిన్న రాజీనామా ప్రకటన విడుదల చేయగా, తాజాగా ఆ జట్టు కోచ్, పాక్ జట్టు మాజీ ఆటగాడు వకార్ యూనిస్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా వకార్ మాట్లాడుతూ, గత 19 నెలలుగా పాకిస్థాన్ జట్టుకు కోచ్ గా సేవలందించానని, చాలా నిబద్ధతతో పని చేశానని అన్నాడు. టీ20 ఓటమికి తనను బలిపశువును చేసే దిశగా పావులు కదుపుతున్నారని చెప్పిన వకార్, దేశానికి తాను చేసిన సేవలు తక్కువ చేసి చూపే ప్రయత్నం చేయవద్దని మాజీ క్రికెటర్లకు సూచించాడు.

  • Loading...

More Telugu News