: తన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ పెళ్లికి హాజరైన పవన్ కల్యాణ్
తన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ రాజేశ్ మోర్ వివాహానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. పవన్, రాజేష్ ల మధ్య సాన్నిహిత్యం ఉండటం వల్లే పవర్ స్టార్ ఈ వేడుకకు హాజరైనట్లు సమాచారం. కాగా, 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి సంబంధించి రెండు పాటల షూటింగ్ నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్లిన పవన్ కల్యాణ్ ఇటీవలే హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఆ తర్వాతే ఈ వివాహానికి హాజరయ్యారు. 'కొమరం పులి' చిత్రంలోని పాటలకు రాజేశ్... పవన్ కల్యాణ్ కు ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేశాడు.