: మాతో కలిసి రండి...అందరం కలిసి ముందుకెళ్దాం: సీఎం కేసీఆర్
‘మాతో కలిసి రండి... అందరం కలిసి ముందుకు వెళ్దాం’ అని సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన ఐటీ పాలసీని ఆవిష్కరించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. ఐటీ రంగానికి తెలంగాణ అనుకూల ప్రాంతమని, తెలంగాణాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే కేవలం 15 రోజుల్లోనే అనుమతిలిస్తున్నామన్నారు. ‘సింగిల్ విండో ఆఫ్ తెలంగాణ వితౌట్ గ్రిల్స్’ అనే నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా ఇప్పటివరకు 1691 పరిశ్రమలకు అనుమతినిచ్చామని, అందులో 803 పరిశ్రమలు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయని కేసీఆర్ పేర్కొన్నారు.