: వరల్డ్ టీ20 కెప్టెన్గా కోహ్లి... 12 మంది ఆటగాళ్ల వివరాలు వెల్లడి
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వరల్డ్ టీ 20 కెప్టెన్ గా ఎంపికయ్యాడు. వరల్డ్ టీ 20లో ప్రతిభ ఆధారంగా మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలతో కూడిన సెలెక్షన్ కమిటీ విరాట్ కోహ్లిని సారథిగా ఎంపిక చేసింది. భారత జట్టు నుంచి విరాట్ తో పాటు, వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు కూడా చోటు దక్కింది. ఈ మేరకు 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ ఈరోజు ప్రకటించింది. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో టీమిండియా చిచ్చర పిడుగు, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి ఆట తీరు అందర్నీ ఆకట్టుకుంది. లీగ్ దశలో నాలుగు మ్యాచ్ లతో పాటు ఓ సెమీ ఫైనల్లో అద్భుత బ్యాటింగ్‌తో.. కోహ్లీ మొత్తం 273 పరుగులు సాధించాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం. నిన్న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ప్రజంటేషన్ సెరెమొనీలో భాగంగా కోహ్లీకి టోర్నీ నిర్వాహకులు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్ టీ 20 జట్టు వివరాలు: విరాట్ కోహ్లి(భారత్, కెప్టెన్), జాసన్ రాయ్(ఇంగ్లండ్), డేవిడ్ విల్లే(ఇంగ్లండ్), శామ్యూల్ బద్రి(వెస్టిండీస్), ఆశిష్ నెహ్రా(భారత్), ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్), డీకాక్(దక్షిణాఫ్రికా), జో రూట్(ఇంగ్లండ్), బట్లర్(ఇంగ్లండ్), షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా), ఆండ్రీ రస్సెల్(వెస్టిండీస్), మిచెల్ సాంట్నార్(న్యూజిలాండ్),