: బెదిరింపుల నేపథ్యంలో... పాకిస్తానీ గాయకుడు గులామ్ అలీ కార్యక్రమం రద్దు
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు సాయంత్రం జరగాల్సి ఉన్న ప్రముఖ పాకిస్తానీ గజల్ గాయకుడు గులామ్ అలీ కార్యక్రమం రద్దయింది. బుల్లితెర ప్రొడ్యూసర్, డైరెక్టర్ సుహెయిబ్ ఇల్యాసీ రూపొందించిన ‘ఘర్ వాపసీ’ అనే హిందీ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఆయన ఆవిష్కరించాల్సి ఉంది. ఢిల్లీలోని రాయల్ ప్లాజా హోటల్ లో ఏర్పాటు చేసిన ఈ ఆడియో వేడుక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు హోటల్ అధికారులు తెలిపారు. ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. హిందూసేన, భజరంగ్ దళ్ నుంచి బెదిరింపులు రావడంతో ఈ కార్యక్రమం రద్దయిందన్నారు.