: తెలంగాణలో వడదెబ్బకు ఐదుగురు మృతి
తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బ తగిలి ఐదుగురు మృతి చెందారు. కరీంనగర్ జిల్లా మహదేవపురం మండలం అంబరవల్లి గ్రామానికి చెందిన బానయ్య(55)తో బాటు, నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో ఇద్దరు, యాద్ గార్ పూర్ లో ఒకరు, కారేగాంలో మరొక వ్యక్తి వడదెబ్బతో మృతి చెందారు. కాగా, వేసవి ప్రారంభం నుంచే పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఎండలు బాగా ఉన్న సమయంలో ఇళ్లలో నుంచి బయటకు రావద్దంటూ ప్రజలను వైద్యులు హెచ్చరించిన విషయం తెలిసిందే.