: వారణాసి జైలులో తిరగబడ్డ 250 మంది ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు


ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జైలులో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆగ్రహించిన ఖైదీలు రెండు రోజుల క్రితం జైలు అధికారులపై తిరగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జైలు సూపరిండెంట్ ఆశిష్ తివారీని బందీగా చేసుకుని ఉన్నతాధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపి, ఏడు గంటల నిర్బంధం తరువాత విడుదల చేశారు. ఈ ఘటనలో జైలు డిప్యూటీ సూపరిండెంట్ అజయ్ రాయ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ ఘటనలో 250 మంది ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై న్యాయవిచారణ జరుగుతోంది.

  • Loading...

More Telugu News