: నలుగురు హీరోలతో రొమాన్స్ చేయనున్న అలియా భట్


బాలీవుడ్ యువనటి అలియా భట్ నలుగురు హీరోలతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. సాధారణంగా సినిమాల్లో ఒక హీరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తుంటాడు. దానికి భిన్నంగా గౌరీ షిండే తీయనున్న సినిమాలో ప్రధాన పాత్ర షారూఖ్ ఖాన్ పోషించనుండగా, అలియా భట్ సరసన ఆదిత్యారాయ్ కపూర్, కునాల్ కపూర్, అంగద్ బేడీ, అలీ జఫర్ నటించనున్నారు. ఈ నలుగురితోను అలియా డేటింగ్ చేసి, ఏదో ఒక ప్రయోజనం పొందుతుందని, షారూక్ విభిన్నమైన పాత్ర పోషించనున్నాడని గౌరీ షిండే తెలిపింది. ఈ సినిమా షూటింగ్ గోవా, ముంబై శివార్లలో జరుగనుందని ఆమె చెప్పింది.

  • Loading...

More Telugu News