: జాకీ చాన్ కాదు...జాకీ జాక్సన్: ఫరాఖాన్ పొగడ్తలు
హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ ను బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ పొగడ్తల్లో ముంచెత్తుతోంది. జాకీచాన్, అమీరా దస్తర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'కుంగ్ ఫూ యోగా' సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాటకు ఫరాఖాన్ దర్శకత్వం వహిస్తోంది. దీని చిత్రీకరణకు రాజస్ధాన్ చేరుకున్న ఫరా ఖాన్ షూటింగ్ లో జాకీ చాన్ చేత కొన్ని స్టెప్పులు వేయించింది. వాటిని అలవోకగా జాకీ చాన్ వేయడం చూసిన ఫరా...'కింగ్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు డ్యాన్స్ కూడా చేయగలరు...ఇప్పుడు ఆయన పేరు జాకీ చాన్ కాదు, జాకీ జాక్సన్' అంటూ ట్వీట్ చేసింది. వీరి ఫోటోకు అభిమానుల ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాలో సోనూ సూద్ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.