: వీడియో కాన్ఫరెన్స్ ల కోసం క్రోమ్ బేస్ కంప్యూటర్లు
వీడియో కాన్ఫరెన్స్ ల కోసం గూగుల్ సంస్థ ప్రత్యేకంగా క్రోమ్ బేస్ డెస్క్ టాప్ కంప్యూటర్లను రూపొందించింది. గూగుల్ హ్యాంగవుట్స్ మీటింగ్స్ తో కనెక్ట్ అయి, 25 మంది వరకు ఒకేసారి కాన్ఫరెన్స్ లో పాల్గొనే అవకాశం ఉందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ క్రోమ్ బేస్ కంప్యూటర్ 24 అంగుళాల టచ్ స్క్రీన్, బ్లూటూత్, రెండు యూఎస్బీ పోర్టులు, ఆడియో వీడియో కంట్రోల్ హెచ్ డీ కెమెరా, నాలుగు మైక్రో ఫోన్లతో పాటు రెండు స్పీకర్లు ఉన్నాయని ‘గూగుల్’ ప్రతినిధులు వెల్లడించారు. కాగా, ఎల్ జీ, ఏసర్ సంస్థలతో కలిసి గూగుల్ తయారు చేసిన క్రోమ్ బేస్ కంప్యూటర్లు గతంలోనే మార్కెట్లో విడుదలయ్యాయి. అయితే, కొత్తగా వచ్చిన క్రోమ్ బేస్ కంప్యూటర్లను మాత్రం ప్రత్యేకించి వీడియో కాన్ఫరెన్స్ ల కోసం రూపొందించారు.