: ముంబయిలో పరుగులు పెట్టనున్న లోకల్ ఏసీ రైలు


ముంబయి నగరంలో తొలిసారిగా లోకల్ ఏసీ రైలు పరుగులు పెట్టనుంది. మండుతున్న ఎండల దృష్ట్యా ముంబయి ప్రయాణికుల సౌకర్యార్థం లోకల్ ఏసీ రైల్ ను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. ఈ రైలులో జనరల్, ఫస్ట్ క్లాసు తరగతులు విడివిడిగా లేవని, అంతా ఒకేలా ఉంటుందని అధికారులు చెప్పారు. మహిళల కోచ్ లను గుర్తించడానికి వీలుగా గుర్తులు ఉంటాయని చెప్పారు. కాగా, చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలును తయారు చేశారు. దీని విలువ రూ.55 కోట్లు. ఈ రైలు చెన్నై నుంచి ముంబయికి ఇప్పటికే బయలుదేరింది. ఈ రైలుకు సంబంధించి మిగిలి వున్న పనులను ముంబయిలో పూర్తి చేయనున్నారు. ఎలక్ట్రిక్, సాఫ్ట్ వేర్ మొదలైన పనులు పూర్తి చేయాల్సి ఉందని, ఈ పనులు పూర్తి చేయడానికి కనీసం నెలరోజుల సమయం పడుతుందన్నారు. ఈ రైలును కుర్లా కార్ షెడ్ లో ఉంచనున్నట్లు అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News