: అదంతా ఉత్తిదే...ప్రియాంక ఆత్మహత్యకు ప్రయత్నించలేదు: తల్లి మధు
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఆత్మహత్యకు ప్రయత్నించిందన్న మాటల్లో వాస్తవం లేదని ఆమె తల్లి మధు పేర్కొన్నారు. 2000-04 మధ్య కాలంలో ఆమె మూడు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందంటూ ఆమె మాజీ మేనేజర్ ప్రకాశ్ జాజు చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. మాజీ ప్రియుడు ఆసీమ్ మర్చంట్ తల్లి మరణించిన సందర్భంగా ఎంతో సన్నిహితురాలైన ఆమె మరణాన్ని తట్టుకోలేక ప్రియాంక మేడపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదని ఆమె స్పష్టం చేశారు. ఆయన జైలుకు కూడా వెళ్లివచ్చాడని, అలాంటి వ్యక్తి మాటల్లో విశ్వసనీయత ఉంటుందా? అని ఆమె అడిగారు. గతంలో అతని తల్లిదండ్రులు ప్రియాంక కాళ్లమీద పడడంతో అతనిని వదిలేశామని ఆమె అన్నారు.