: అలా నినదించకుంటే వందలాంది మందిని తలనరికి చంపేసేవాడిని: రాందేవ్ బాబా
'నా గొంతుపై కత్తిపెట్టినా ఆ నినాదాన్ని చేయను. 'భారత్ మాతాకీ జై' అని ప్రతి ఒక్కరూ కచ్చితంగా నినదించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు' అని అసరుద్దీన్ ఒవైసీ తీసుకొచ్చిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారేలా లేదు. దీనిపై పార్లమెంట్‌లోనూ పెద్ద చర్చే జరిగింది. దేశంలోని బడా నేతలు, మతగురువులు ఇప్పటికీ దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా, యోగా గురు రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలపై కాస్త గట్టిగానే స్పందించారు. ‘భారత్ మాతాకీ జై’ అనకుంటే తాను వందలాది మందిని తలనరికి చంపేసేవాడినని అన్నారు. అయితే రాజ్యాంగంలో భారత్ మాతాకీ జై అనాలని ఎక్కడా లేదు కాబట్టి, దాని మీద ఉన్న గౌరవంతో ఆ పని చెయ్యడం లేదని వ్యాఖ్యానించారు. ‘భారత్ మాతాకీ జై’ అనడం తనకిష్టం లేదని కొంత మంది బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని, అందుకు వారు సిగ్గుపడాలని విమర్శించారు. ప్రతి ఒక్కరు తమ మాతృదేశాన్ని గౌరవించాల్సిందేనని చెప్పారు.