: వరద వస్తే కొట్టుకుపోయే అమరావతి: ఎన్జీటీలో వాదనలు
కృష్ణానదితో పాటు కొండవీటి వాగుకు వరదలు వస్తే, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నారని, జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ లో నిబంధనలకు విరుద్ధంగా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్న పిటిషనర్లు తమ వాదనలను వినిపించారు. వరద ప్రభావిత ప్రాంతాలను నిర్మాణ పరిధి నుంచి తొలగించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. రాజధాని బృహత్ ప్రణాళిక నుంచి ఈ ప్రాంతాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అసలు వరదకు గురయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి వుందని, ఇవేమీ చేయకుండానే అమరావతిని నిర్మిస్తున్నారని తెలిపారు. తాము ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాన్ని గుర్తించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ట్రైబ్యునల్ ముందు వాదించగా, కేసు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.