: నేనున్నాగా... అనుష్కను వదిలెయ్: కోహ్లీకి పాక్ మోడల్ సందేశం


వరల్డ్ కప్ టీ-20 పోటీల సందర్భంగా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన వీడియోలు విడుదల చేసి వార్తల్లో నిలిచిన పాక్ మోడల్ క్వాండీల్ బాలోచ్, నేడు మరో వీడియోను ఆన్ లైన్లోకి వదిలింది. అయితే, ఈ దఫా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని టార్గెట్ గా చేసుకుందీ భామ. అనుష్క శర్మను గురించి ఆలోచించడం మానివేయాలని సలహా ఇచ్చింది. 'నీతో డేటింగ్ చేయాలని ఉంది' అని తన మనసులోని కోరికను చెప్పుకుంది. తన గురించి సీరియస్ గా ఆలోచించాలని హస్కీ వాయిస్ తో కోరుకుంది. 'విరాట్ ఐ లవ్యూ బేబీ... ప్లీజ్ ప్లీజ్...' అంటూ హొయలు పోయింది. చివరిగా ఓ ముద్దు కూడా ఇచ్చిందండోయ్. మరి ఇక క్వాండీల్ కు విరాట్ ఏం సమాధానం చెబుతాడో!

  • Loading...

More Telugu News