: 'పనామా పేపర్స్' నల్ల ధనం దాచుకున్న వారి పూర్తి జాబితా!
ఐసీఐజే (ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్) ఏళ్ల తరబడి శ్రమించి, శోధించి బహిర్గతం చేసిన నల్లధనం దాచుకున్న వారి పూర్తి వివరాలు... దేశాధినేతలు: మౌరికో మాక్రి, అర్జెంటీనా అధ్యక్షుడు. సిగ్ముందర్ డేవియో గునాల్గుసన్, ఐస్ ల్యాండ్ ప్రధాని. సల్మాన్, సౌదీ అరేబియా రాజు. ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు. పెట్రో పోరోషన్కో, ఉక్రెయిన్ అధ్యక్షుడు. మాజీ దేశాధినేతలు బిద్ జినా ఇవానిష్ విలీ, జార్జియా మాజీ ప్రధాన మంత్రి. అయద్ అలావీ, ఇరాక్ తాత్కాలిక ప్రధాని. ఆలీ అబూ అల్ రహేబ్, జోర్డాన్ మాజీ ప్రధాన మంత్రి. హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ, ఖతార్ మాజీ ఎమిర్ హమద్ బిన్ జాసిమ్ బిన్ జాబెర్ అల్ థానీ, ఖతార్ మాజీ ప్రధాని. అహ్మద్ అల్-మిర్గానీ, సూడాన్ మాజీ అధ్యక్షుడు. పావ్ లో లాజరెంకో, ఉక్రెయిన్ మాజీ ప్రధానమంత్రి. మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఇతరులు: అల్జీరియా: అబ్దెస్లామ్ బౌచోరెబ్, ఇండస్ట్రీ, గనుల మంత్రి అంగోలా: జోస్ మరియా బొతెల్హో డి వాస్కోనెసిలస్, పెట్రోలియం మంత్రి. అర్జెంటీనా: నెస్టర్ గ్రిండెటే, లానుస్ నగర మేయర్. బోత్స్వానా: ఇయాన్ కిర్బీ, బోత్వ్యానా మాజీ అటార్నీ జనరల్ బ్రెజిల్: జోవా లైరా, డిప్యూటీస్ చాంబర్ సభ్యుడు కంబోడియా: జస్టిస్ ఆంగ్ వాంగ్ వతానా, న్యాయ శాఖా మంత్రి చిలీ: ఆల్ఫ్రెడో ఓవల్లే రోడ్రిగెజ్, ఇంటెలిజెన్స్ ఏజన్సీ సభ్యుడు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో: జైనెట్ కాబిలా, నేషనల్ అసెంబ్లీ సభ్యుడు. కాంగో రిపబ్లిక్: బ్రూనో ఇటోవా, సైంటిఫిక్, పరిశోధనా శాఖా మంత్రి. ఈక్వడార్: గాలో చిరిబోగా, అటార్నీ జనరల్. పెడ్రో డెల్గాడో, సెంట్రల్ బ్యాంక్ మాజీ గవర్నర్. ఫ్రాన్స్: జెరోమీ చుహుజక్, ఆర్థిక శాఖ మాజీ మంత్రి. గ్రీస్: స్టావ్రోస్ పాపాస్టావ్ రోవ్, మాజీ ప్రధానులకు సలహాదారు. హంగేరి: జోల్ట్ హోర్వత్, నేషనల్ అసెంబ్లీ మాజీ సభ్యుడు. ఐస్ ల్యాండ్: బిజర్నీ బెనడిక్ట్ సన్, ఆర్థిక మంత్రి. ఓల్ఫ్ నార్డాల్, అంతర్గత వ్యవహారాల మంత్రి. ఇండియా: అనురాగ్ కేజ్రీవాల్, లోక్ సత్తా పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు. కెన్యా: కల్పనా రావల్, సుప్రీం కోర్ట్ డిప్యూటీ చీఫ్ జస్టిస్. మాల్టా: కొన్రాడ్ మిజ్జీ, ఇంధన, ఆరోగ్య శాఖా మంత్రి. నైజీరియా: జేమ్స్ ఐబోరి, డెల్టా రాష్ట్ర మాజీ గవర్నర్. పాలస్తీనా: ముహమ్మద్ ముస్తఫా, నేషనల్ ఎకానమీ శాఖ మాజీ మంత్రి. పనామా: రికార్డో ఫ్రాంకోలినీ, సేవింగ్స్ బ్యాంక్ మాజీ చైర్మన్ పెరు: సీసర్ అల్మేదా, నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ డైరెక్టర్. పోలాండ్: పావెల్ పిస్కోర్క్సీ, వార్సా నగర మాజీ మేయర్. రువాండా: ఇమ్మానుయేల్ నదాహిరో, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బ్రిగేడియర్ జనరల్, మాజీ ముఖ్యమంత్రి. సౌదీ అరేబియా: ముహమ్మద్ బిన్ నాయెఫ్, సౌదీ యువరాజు, అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి యునైటెడ్ కింగ్ డమ్: మైఖేల్ అష్ క్రాఫ్ట్, హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు. మైఖేల్ మేట్స్, హౌస్ ఆఫ్ కామన్స్ మాజీ సభ్యురాలు. పమేలా షార్ప్ లెస్, హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు. వెనిజులా: విక్టర్ క్రజ్ వెఫర్, ఆర్మీ మాజీ కమాండర్-ఇన్-చీఫ్. జీసస్ విల్లాన్యూవా, పీడీవీఎస్ఏ మాజీ డైరెక్టర్. జాంబియా: అటాన్ షాన్సోంగా, అమెరికాకు మాజీ రాయబారి. వీరితో పాటు పలు దేశాల ప్రభుత్వ అధికారుల బంధువులు, వారి సన్నిహితుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.