: మోదీజీ... ఇదేం నీతి?: ఐడీబీఐ ప్రైవేటీకరణపై ప్రధానికి కేజ్రీ ఘాటు లేఖ


ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ ఘాటు లేఖ రాశారు. అదేదో... కేంద్రం, రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించిన వ్యవహారంపై కాదు. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఓ పెను మార్పుకు మోదీ సర్కారు నాందీ పలుకుతున్న వైనానికి సంబంధించిన వ్యవహారంపై ఆయన ఆ లేఖ సంధించారు. ప్రభుత్వ రంగంలోని ‘ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ)’ ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్న మోదీ సర్కారు తీరును కేజ్రీ తన లేఖలో తూర్పారబట్టారు. వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోతున్న విజయ్ మాల్యా లాంటి పారిశ్రామికవేత్తలపై కఠిన చర్యలు చేపట్టాల్సింది పోయి, అలాంటి పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం ఆయా బ్యాంకులకు ఇవ్వడం లేదని కేజ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామికాభివృద్దిలో ఐదు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించిన ఐడీబీఐని ప్రైవేటీకరించేందుకు చేస్తున్న యత్నంలో అర్థం లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలే చేశారు. బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న బడా పారిశ్రామికవేత్తలు విదేశాలకు పారిపోయేందుకు కేంద్రం సాయం చేస్తోందని కూడా ఆయన ఆ లేఖలో మోదీ సర్కారును నిందించారు. ఏదేమైనా ఐబీడీఐని ప్రైవేటు పరం చేయొద్దని ఆయన కేంద్రాన్ని అభ్యర్థించారు.

  • Loading...

More Telugu News