: నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మెహబూబా ముఫ్తీ.. బాయ్ కాట్ చేయనున్న కాంగ్రెస్
జమ్మూకాశ్మీర్‌లో ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఆ రాష్ట్ర మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా మోహబూబా ముప్తీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నిర్మల్‌సింగ్ ప్రమాణం చేయనున్నారు. కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ అధ్యక్షుడు జీఏ మిర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరెస్సెస్ మద్దతు ఉన్న ఏ ప్రభుత్వాన్నైనా తాము వ్యతిరేకిస్తామని, మూడు నెలల పాటు రాష్ట్రంలో ప్రభుత్వం లేకుండా మెహబూబా జాప్యం చేసినందుకు గానూ తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. రాజ్‌భవన్‌లో ఈరోజు ఉదయం 11 గంటలకు మోహబూబా ముప్తీతో ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.