: విండీస్ ‘విన్నర్’పై మాస్టర్ బ్లాస్టర్ ప్రశంసల జల్లు!


ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో నిన్న రాత్రి కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ లో ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్ పోరులో వెస్టిండీస్ జట్టు విజేతగా నిలిచింది. ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్ ను చిత్తు చేసి టైటిల్ ను ముద్దాడింది. ఈ సందర్భంగా విండీస్ జట్టు విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు హోరెత్తాయి. టీమిండియా మాజీ క్రికెటర్ ‘భారతరత్న’ సచిన్ టెండూల్కర్... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా సచిన్ పోస్ట్ చేసిన మెసేజ్ చూస్తే విండీస్ ‘విన్నర్’గా నిలిచిన కార్లోస్ బ్రాత్ వైట్ మురిసిపోక తప్పదు. ‘బ్రాత్ వైట్ వాజ్ బ్రీత్ టేకింగ్’ అంటూ అతడిని సచిన్ అభివర్ణించారు. అండర్-19, మహిళలు, పురుషులు... మూడు విభాగాల్లో విండీస్ విజేతగా నిలిచిన వైనాన్ని ప్రస్తావించిన సచిన్... ఆ దేశ జట్ల ఆట తీరు అద్భుతమంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News