: ఇదోరకం సరికొత్త లింగ సమానత్వం... త్రయంబకేశ్వరుని సన్నిధికి పురుష ప్రవేశం నిషిద్ధం!
ఓవైపు ప్రసిద్ధ దేవాలయాల గర్భగుడిలోకి తమను అనుమతించాలని మహిళలు నిరసనలు తెలియజేస్తున్న వేళ, లింగ సమానత్వం పాటించాలని హైకోర్టు తీర్పివ్వగా, దానికి సరికొత్త అర్థం చెప్పింది, ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన త్రయంబకేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి. ఆలయ గర్భగుడిలోకి మహిళలను రానిచ్చేది లేదని చెబుతూ, ఇకపై పురుషులకూ ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించింది. మహారాష్ట్రలోని నాసిక్ కు 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వరుని ఆలయం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆలయంలో శివునికి అభిషేకాలు చేసేందుకు గర్భగుడిలోకి ఉదయం పూట గంట పాటు పురుషులను అనుమతిస్తారు. ఇక మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయని బాంబే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో త్రయంబకేశ్వర ఆలయ కమిటీ సరికొత్త లింగ సమానత్వాన్ని చూపుతోంది.