: మోదీకి సౌదీ అత్యున్నత పురస్కారం


భారత ప్రధాని నరేంద్ర మోదీని సౌదీ అరేబియా ఘనంగా సత్కరించింది. సౌదీ ఆధునిక నిర్మాతగా పేరుగాంచిన అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ పేరిట నెలకొల్పిన ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ... బెల్జియం, అమెరికాల పర్యటనను ముగించుకుని సౌదీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నిన్న రియాద్ లో సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్... మోదీకి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇప్పటిదాకా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, జపాన్ ప్రధాని షింజో అబే, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తదితరులు ఈ అవార్డును అందుకున్నారు.

  • Loading...

More Telugu News