: ఎన్నికలు షురూ!... పశ్చిమ బెంగాల్, అసోంలలో తొలి దశ పోలింగ్ ప్రారంభం


దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల క్రతువులో భాగంగా తొలి విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ లోని 18, అసోంలోని 65 స్థానాలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది. మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రాంతాలకు చెందిన ఈ నియోజకవర్గాల ఎన్నికలకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించింది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పోలింగ్ నేటి సాయంత్రం దాకా కొనసాగనుంది. అసోంలోని 65 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 539 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, బెంగాల్ కు చెందిన 18 స్థానాల్లో 133 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News