: టీ 20 ప్రపంచ విజేత వెస్టిండీస్... పోరాడి ఓడిన ఇంగ్లాండ్!
కిక్కిరిసిన క్రీడాభిమానుల సమక్షంలో ఉత్కంఠభరితంగా జరిగిన టీ 20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో వెస్టిండీస్ విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య నువ్వా? నేనా? అన్నంతగా జరిగిన తుది పోరులో చివరికి విజయం విండీస్ పక్షాన నిలిచింది. విండీస్ ఆటగాడు శామ్యూల్స్ 85 (నాటౌట్) పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించగా, చివర్లో మరో ఆటగాడు బ్రాత్ వైట్ వరుసగా నాలుగు సిక్సులు కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, నాలుగు వికెట్ల తేడాతో ఈ విజయాన్ని సొంతం చేసుకుని టీ 20 ప్రపంచ విజేతగా నిలిచింది.