: బాలీవుడ్ నటుడు ఖాదర్ ఖాన్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు!


కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్ మృతి చెందాడంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు హల్ చల్ చేయడంపై దర్శకురాలు ఫౌజీ ఆర్షీ మండిపడ్డారు. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తుండటంతో ఖాదర్ ఖాన్ కుటుంబానికి ఫోన్ చేస్తే అసలు విషయం తెలిసిందని, ఆ వార్తలు అవాస్తవమని చెప్పారు. ఖాదర్ ఖాన్ తో కూడా తాను మాట్లాడానని ఆమె చెప్పారు. అసలు విషయం తెలుసుకోకుండా ఇటువంటి వార్తలను సామాజిక మాధ్యమాల్లో ఉంచే ముందు నెటిజన్లు ఆలోచించాలని ఆమె హితవు పలికారు. కాగా, ఫౌజీ ఆర్షీ దర్శకత్వం వహించిన ‘హోగయా దిమాంగ్ దహి’ చిత్రంలో ఇటీవల ఖాదర్ ఖాన్ నటించారు.

  • Loading...

More Telugu News