: కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న అఫ్రిది
టీ 20 పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ బాధ్యతల నుంచి షాహిద్ అఫ్రిది తప్పుకున్నాడు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశాడు. ‘పాకిస్థాన్ లోను, ప్రపంచవ్యాప్తంగాను ఉన్న నా అభిమానులకు టీ20 పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ బాధ్యతల నుంచి ఈ రోజు నుంచి తప్పుకుంటున్న విషయాన్ని తెలియజేస్తున్నాను. నా దేశం గౌరవం కోసం నా శక్తి సామర్థ్యాల మేరకు పోరాడేలా చేసినందుకు అల్లా (ఎస్ డబ్ల్యుటి)కు కృతఙ్ఞతలు చెబుతున్నాను. మూడు ఫార్మాట్లకు సంబంధించి టీమ్ కు నాయకత్వం వహించే అవకాశం నాకు రావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా పీసీబీకి, చైర్మన్ షహర్యార్ ఖాన్ కు కృతఙ్ఞతలు’ అని అఫ్రిది పేర్కొన్నాడు. పాకిస్థాన్ టీమ్ లో ఆటగాడిగా కొనసాగుతానని, తన అభిమానులు తనకు మద్దతుగా నిలవాలని కోరాడు.