: దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘విశాఖ’లో మెడ్ టెక్ పార్క్: ఏపీ మంత్రి కామినేని


దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో మెడ్ టెక్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. 260 ఎకరాల్లో రూ.225 కోట్ల వ్యయంతో ఈ పార్క్ ను ఏర్పాటు చేయనున్నామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో పార్క్ ను ఏర్పాటు చేస్తామని, ఈ పార్క్ లో తక్కువ ధరలకే వైద్య పరికరాలను తయారు చేయవచ్చని పేర్కొన్నారు. 2015-16 నాటికి రాష్ట్రంలో తల్లీపిల్లల మరణాలను గణనీయంగా తగ్గించిన రాష్ట్రంగా ఏపీకి కేంద్రప్రభుత్వం అవార్డుతో పాటు ఇన్సెంటివ్ కూడా ఇచ్చిందన్నారు. కాగా, రాజకీయాల గురించి ఆయన ప్రస్తావిస్తూ, టీడీపీ, బీజేపీ రెండూ బలపడాలని, మిత్రపక్షంగా టీడీపీతో కలిసి ఉంటామని కామినేని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News