: ఆ దర్శకుడికి కోపమొస్తే తిడతారు బాబూ!: హీరోయిన్ నందిత
దర్శకుడు తేజకు కోపం వస్తే తిడతారని హీరోయిన్ నందిత చెప్పింది. ‘నీకు.. నాకు డాష్ డాష్’ చిత్రం షూటింగ్ లో ప్రతి సీన్ కు దర్శకుడు తేజతో తిట్లు తిన్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నందిత మాట్లాడుతూ, తేజకు కోపం వస్తే చాలా గట్టిగా తిడతారని చెప్పింది. తనకు వేరే వారితో ఎఫైర్లు ఉన్నట్లు వచ్చే వార్తలను అస్సలు పట్టించుకునే ప్రసక్తే లేదంది. ఆమె కళ్ల గురించి ప్రశ్నించగా, ‘నా కళ్లు బాగుంటాయని చెప్పడం కన్నా, పెద్ద కళ్లు అని చాలా మంది చెప్పారు. అది నాకు బిగ్ కాంప్లిమెంట్’ అని నందిత చెప్పింది.