: 20 కుక్కలను పెంచుతున్న హీరో రాజ్ తరుణ్
యువహీరో రాజ్ తరుణ్ కు కుక్కలంటే చాలా ఇష్టముట. అందుకే, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 కుక్కలను పెంచుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజ్ తరుణే పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను సింగిల్ గా ఉంటున్నానని, ఒక మంచి ప్రియుడిగా ఉంటానో లేదో తనకు తెలియదుగానీ, తాను పెంచుకుంటున్న కుక్కలపై మాత్రం తనకు చాలా ప్రేమ ఉందని 23 సంవత్సరాల యువనటుడు రాజ్ తరుణ్ పేర్కొన్నాడు. కాగా, 'కుమారి 21 ఎఫ్' చిత్రం ద్వారా మంచిపేరు సంపాదించుకున్న రాజ్ తరుణ్ తాజా చిత్రం ‘ఈడో రకం ఆడోరకం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నటిస్తున్నారు.