: వైద్యశాఖలో ఖాళీగా ఉన్న నాలుగు వేల పోస్టులు భర్తీ చేస్తాం: తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణ వైద్య శాఖలో ఖాళీగా ఉన్న నాలుగు వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ట్రామాకేర్ సెంటర్ ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో నాలుగు ట్రామా కేర్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.