: ఇందిరాగాంధీ పాత్రలో విద్యాబాలన్!
భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ పాత్రలో నటి విద్యాబాలన్ నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ రచయిత, దర్శకుడు మనీష్ గుప్త దర్శకత్వం వహించనున్నారు. ‘ఎమర్జెన్సీ’ విధించిన పరిస్థితులపై చర్చించి అవసరమైన మార్పులు చేయాల్సి ఉండటంతో నిర్మాణం కొంచెం ఆలస్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టే అవకాశాలు లేకపోలేదని అన్నారు. ఢిల్లీ, ముంబైతో పాటు ఇతర నగరాల్లో ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని మనీష్ గుప్తా పేర్కొన్నారు.