: నాణ్యతా రహితం... బూడిద కలిసుంది: పతంజలి నూడిల్స్ పై ఎఫ్ఎస్డీయే సంచలన నివేదిక


యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పతంజలి సంస్థ మార్కెటింగ్ చేస్తున్న ఆటా నూడిల్స్ నాణ్యతా ప్రమాణాలకు దూరంగా ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ర్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎస్డీయే) అధికారులు సంచలన నివేదిక ఇచ్చారు. ఈ నూడిల్స్ తో పాటు లభించే టేస్ట్ మేకర్ లో బూడిద కలిసుందని వారు వివరించారు. గత నెల 5న ఈ శాంపిల్స్ మీరట్ లోని దుకాణాల నుంచి సేకరించామని, మొత్తం మూడు శాంపిల్ ప్యాకెట్లను పరిశీలించగా, అన్నింటిలో బూడిద అధిక స్థాయిలో ఉందని పేర్కొంది. ఇవి వినియోగించడానికి పనికిరావని వెల్లడించింది. మ్యాగీలో కనుగొన్న అనారోగ్య రసాయనాలతో పోలిస్తే, పతంజలి నూడిల్స్ లో మూడు రెట్ల అధిక రసాయనాలు ఉన్నాయని ఎఫ్ఎస్డీయే అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News