: మహిళా పోలీసు ఫిర్యాదుతో సీఐడీ ఇన్ స్పెక్టర్ పై నిర్భయ కేసు
కింది స్థాయి ఉద్యోగినిని వేధింపులకు గురి చేసిన కేసులో కరీంనగర్ సీఐడీ ఇన్ స్పెక్టర్ దయాకర్ రెడ్డిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, కోరిక తీర్చమని వేధిస్తున్నాడని పోలీసు స్టేషన్ లో మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఆయనపై కఠినమైన 'నిర్భయ' కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేసును విచారిస్తున్నామని, దయాకర్ రెడ్డి వేధింపులకు పాల్పడినట్టు తేలితే అరెస్ట్ చేస్తామని కరీంనగర్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కేసు విషయమై మరిన్ని విషయాలు తెలియాల్సి వుంది.